విద్యను రాజకీయం చేయొద్దు.. స్టాలిన్ కి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్

-

జాతీయ విద్యా విధానం అమలుపై తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ భాషను బలవంతంగా రుద్దడం లేదని స్పష్టం చేశారు. విదేశీ భాషపై అతిగా ఆధారపడటం వల్ల విద్యార్థులు భాషాపరమైన మూలాలను తెలుసుకోకుండా పరిమితం చేసినట్లవుతుందన్నారు. జాతీయ విద్యావిధానం  ద్వారా ఈ
పరిస్థితిని సరిచేసే ప్రయత్నం జరుగుతోందన్నరు.

తమిళ భాష శాశ్వతమని గతంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తమిళ సంస్కృతి, భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు మోడీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. విద్యను రాజకీయం చేయొద్దని కోరారు. కాగా.. సమగ్రశిక్షా పథకం కింద రాష్ట్రానికి వెంటనే రూ.2,152 నిధులు మంజూరు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి  ఇటీవలే తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాని ఈ కామెంట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version