రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం 20వ విడత సాయం రూ. 2 వేల కోసం రైతులు నెల రోజులుగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే పీఎం మోడీ ఆగస్టు 2న వారణాసి పర్యటన సందర్భంగా నిధులు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా వెల్లడించింది.

17వ విడత డబ్బులు కూడా వారణాసి పర్యటన సందర్భంగా రిలీజ్ చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 2 వేలతో పాటు ఏపీ ప్రభుత్వం అందజేయనున్న రూ. 5 వేలు కలిపి రూ. 7 వేలు ఆ రోజే విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.