ఆగస్టు 2న పగటిపూట చీకటి పడనుంది. 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అత్యంత దీర్ఘకాల సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027న సంభవించనుంది. ఇది దాదాపు 6.23 నిమిషాల పాటు కొనసాగబోతోంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పి వేయడంతో భూమిపై పగటి సమయంలోనూ రాత్రిల కనిపించబోతోంది.

ఈ గ్రహణం భారతదేశం మినహా దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాంచ్యంలోని కొన్ని ప్రాంతాలలో ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తోంది. 2114 సంవత్సరం వరకు మళ్లీ ఇలాంటి సూర్యగ్రహణం సంభవించదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.