ఏపీలో అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ వైస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. అయితే నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని కాకాణి నివాసానికి కావలి డీఎస్పీ నేతృత్వంలోని పోలీసు బృందం వెళ్లింది. మూడోసారి ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు.
అయితే కాకాణి ఇంట్లో లేరని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. దీంతో చేసేదేం లేక అధికారులు ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో ఏప్రిల్ 3వ తేదీన (గురువారం) నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాలని వారు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సార్లు కాకాణికి పోలీసులు నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. అయిేత రెండు సార్లు ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఇవాళ మూడో సారి ఆయన పోలీసులు నోటీసులు ఇచ్చారు.