కేసీఆర్‌ కాళ్లకు దండం పెట్టి ఆ విషయం అడుగుతా : పోసాని

-

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల వల్ల సినిమా ఇండస్ట్రీ కాస్త గందరగోళానికి గురవుతోందని  పీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌టీవీడీసీ) ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల తీరు తెలుగు సినీ పరిశ్రమకు కటింగ్‌, ఫిటింగ్‌ అయిపోయిందని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమాలను ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరించినా శిక్ష లేకుండా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళ్లకు దండం పెట్టి అడుగుదామని అనుకుంటున్నానని చెప్పారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో ఉచితంగా సినిమాలు తీసుకోవచ్చని చెప్పారు. అలాగని చిత్రీకరిస్తే తెలంగాణలో స్థలాలిచ్చాం కదా? ఎందుకు వెళ్లారని అక్కడ అంటారు. తెలంగాణలోనే ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో స్థలాలు ఇస్తామన్నా ఎందుకు ఉండరని అంటారు. ఈ పరిస్థితి తెలుగు సినీ పరిశ్రమకు కటింగ్‌, ఫిటింగ్‌ అయిపోయింది..’ అని పోసాని పేర్కొన్నారు.  ‘రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇష్టపడితేనే సమస్య పరిష్కారమవుతుంది. హృదయపూర్వకంగా కోరితే కేసీఆర్‌ సాయం చేస్తారు’ అని వివరించారు. ‘తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్‌తో ముడిపడి ఉంది. ఆయనకు సాధకబాధకాలు చెప్పి ఒప్పించాలి.’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version