టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన ముద్దుల తనయ సితార ఘట్టమనేని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. సీతా పాప టాలెంట్ చూసి మురిసిపోతున్నారు. తన అందం, డ్యాన్స్‌తో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న సితార.. తొలిసారి ఓ జ్యువెలరీ యాడ్‌లో నటించింది. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జులై 4న ఆ ప్రకటనను న్యూయార్క్‌లోని ‘టైమ్స్ స్క్వేర్’ పై ప్రదర్శించారు. సంబంధిత విజువల్స్‌ను మహేశ్ బాబు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
‘టైమ్స్ స్క్వేర్‌నే వెలిగిస్తున్నావు..!! నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ఇలానే కొనసాగించు’’ అని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు, సితార కూడా సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేసింది. టైమ్స్ స్వ్కేర్‌పై తనని తాను చూసుకుని గట్టిగా అరిచినట్టు, భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నట్టు పేర్కొంది.
ఈ పోస్ట్ చూసిన పలువురు సినీ ప్రముఖులు, మహేశ్ బాబు అభిమానులు, నెటిజన్లు సితారకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించిందంటూ కొనియాడుతున్నారు. టైమ్స్ స్వ్కేర్‌పై మెరిసిన ఫస్ట్ స్టార్ కిడ్ అని పేర్కొంటున్నారు.
Lighting up the Times Square!! 💥💥💥 So so proud of you my fire cracker ♥️♥️♥️ Continue to dazzle and shine!! 😘😘😘 #SitaraGhattamaneni pic.twitter.com/3ALO0HGNMy
— Mahesh Babu (@urstrulyMahesh) July 4, 2023