నంది అవార్డు లపై ఏపి ఫిల్మిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి షాకింగ్ కామెంట్స్ చేశారు. గుంటూరులో ఏపి ఫిల్మిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడుతూ…గతంలో నంది అవార్డుల చుట్టూ వివాదాలు ఉండేవన్నారు. నేను విమర్శించడంతోనే నాకు నంది అవార్డు రాలేదని వెల్లడించారు.
ఒకసారి అవార్డ్ ఇచ్చినా నాకు వద్దని చెప్పానని వివరించారు. తక్కువ టైం ఉండటం తో నే కేవలం నాటకాలకు మాత్రమే అవార్డులు ఇస్తున్నామన్నారు. చాలా మంది అవార్డులు రికమండేషన్ మీదే ఇస్తున్నారని భావిస్తున్నారని వెల్లడించారు. అయితే నిజాయితీగా, నిజమైన వారికే నంది అవార్డు ఇవ్వమని సిఎం చెప్పారు… సిఫార్సులు చేస్తే అవార్డు ఇవ్వొవద్దని చెప్పానని పేర్కొ న్నారు. సిఫార్సుకు అవార్డ్ ఇస్తే రాజీనామా చేస్తాను అని చెప్పానన్నారు ఏపి ఫిల్మిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి.