ఏపీ వాసులకు శుభవార్త. ఏపీలోని గ్రామ కంఠాల పరిధిలో ఇల్లు లేదా ఇంటిస్థలం ఉండి ఎలాంటి హక్కు పత్రాలు లేని యజమానులకు మేలు జరిగేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్తగా యాజమాన్య హక్కుతో కూడిన ఆస్థి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు శ్రీకారం చుడుతోంది. తొలి విడతగా 25 జిల్లాలోని 205 గ్రామాల్లో 80,581 మంది ఇళ్ల యజమానులకు, వచ్చే నెలలో సీఎం జగన్ చేతుల మీదుగా ఆస్తి సర్టిఫికెట్లు అందించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే, రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య 27 వేల ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, 1.19 లక్షల ఇళ్ల నిర్మాణం ఒకదశ నుంచి మరోదశ పూర్తయింది. మరింత వేగంగా ఇళ్ళ నిర్మాణం చేసిన ఒక 11 మంది రాష్ట్రస్థాయి సీరియల్ అధికారులకు జిల్లాల పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. ఉగాది నాటి ఐదు లక్షల ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.