తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని.. ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు.
“తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోంది” అంటూ ట్వీట్ చేశారు జగన్. ఈనెల 28న వై.ఎస్. జగన్ తిరుమలకు వచ్చి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు.