పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి పేర్ని నాని. బుధవారం తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. తప్పు చేసిన వారే దీక్షలు, గుడిమెట్లు కడుగుతారని అన్నారు.

బాప్టిజం తీసుకున్నానని చెప్పిన వ్యక్తి, ముస్లిం ఇళ్లలో హలాల్ తిన్న వ్యక్తికి హిందూధర్మం గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. కొత్తగా మతం తీసుకున్న వారే నామాలు ఎక్కువ పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు తిరుమల పవిత్రతను దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు.

చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడారని.. లోకేష్ ప్రసాదం పై చేస్తున్న అసత్య ప్రచారానికి పవన్ కూడా జత కలిశారని అన్నారు. దున్నపోతు ఈనిందంటే అన్న సామెత మాదిరి పవన్ తీరు ఉందన్నారు. చంద్రబాబు సీఎం పదవిలో ఉండి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కూటమి నేతల పాపాల పరిహారం కోసం ఆలయాలలో పూజలకు వైసీపీ పిలుపునిస్తుందని తెలిపారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version