కూటమి పాపాలను కడిగేందుకు పూజలు : పేర్ని నాని

-

కూటమి పాపాలను క్షమించి వదిలేయమని సెప్టెంబర్ 28న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయాలని వై.ఎస్. జగన్  పిలుపునిచ్చినట్టు తెలిపారు మాజీ మంత్రి పేర్ని నాని. బుధవారం మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసం చంద్రబాబు దైవాన్ని కూడా వదలడం లేదని పేర్కొన్నారు.

తిరుమల నెయ్యిని వెనక్కి పంపామని ఈవో శ్యామలరావు తెలిపారు. చంద్రబాబు, లోకేష్ మాత్రం పచ్చి అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదం పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసారు. తన కుట్ర రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చెప్పారు. అలాంటిదేమి లేదని ఈవో శ్యామలరావు చెబుతుంటే.. చంద్రబాబు అడ్డమైన ఆరోపణలు చేశారు. లోకేష్ అయితే ఏకంగా పంది కొవ్వు కలిసిందన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అలాగే ఆరోపణలు చేశారు. ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేయాలని వైసీపీ భావించింది. పవన్ కళ్యాణ్ గారు కనకదుర్గ ఆలయాన్ని శుద్ధి చేసి పసుపు, కుంకుమ పూసిన విషయాన్ని సైతం గుర్తు చేశారు పేర్నినాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version