జగన్ ఇంటిపై ఎలాంటి దాడి జరుగలేదు – పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్

-

జగన్ ఇంటిపై ఎలాంటి దాడి జరుగలేదని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ కీలక ప్రకటన చేశారు. జగన్ మనస్తత్వంపై తిరగబడిన పులివెందుల వైసీపీ కార్యకర్తలు అంటూ ఎల్లో మీడియా బ్రేకింగ్‌ వేసింది. పులివెందులలో జగన్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్ళి, జగన్‌కు వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు అంటూ వార్తలు ప్రచారం చేసింది.

Pulivendula DSP Vinod Kumar on jagan

అధికారంలో ఉండగా తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమై, ఇప్పుడు పులివెందులలో మేము గుర్తుకు వచ్చామా అంటూ, వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారంటూ బ్రేకింగ్‌ మీద బ్రేకింగ్‌ వేసింది. అయితే.. ఎల్లో మీడియా ప్రచారంపై పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ కీలక ప్రకటన చేశారు.

పులివెందులలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని…. ఒక్క సారిగా అందరూ లోపలికి వెళ్లే ప్రయత్నంతో కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయి పులివెందులలో ఎటువంటి రాళ్లదాడి జరగలేదని వెల్లడించారు. పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదు. కేవలం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని చూడటానికి ప్రజలు ఆత్రుతతో ఒకరిపై ఒకరు తోపులాట జరిగిందన్నారు పులివెందుల డిఎస్పి వినోద్ కుమార్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version