పురంధేశ్వరి జగత్ కిలాడీ.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కామ్ ల ద్వారా స్కీమ్ లను వాడుకున్న ఘనత చంద్రబాబుది. రెయిన్ గన్ లతో ఎక్కడైనా కరువు జయించగలమా. రెయిన్ గన్ తో వేలాది ఎకరాలు పండించగలమా. రెయిన్ గన్ విషయంలో కూడా చంద్రబాబుపై కేసులు పడతాయి. జైలుకు పోతాడు అని ఆమె పేర్కొన్నారు. రైతు ద్రోహి చంద్రబాబు కోట్లాది రూపాయలు జగన్ ప్రజలకు ఇస్తున్నాడు అని మంత్రి రోజా తెలిపారు.

సీఎం జగన్ కేసులపై కక్ష సాధింపులో భాగంగా సుప్రీంకోర్టుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి లేఖ రాశారు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పురందేశ్వరి ఆమె పని ఆమె చూసుకుంటే చాలు. జగన్ కేసుల గురించి లేఖలు రాయాల్సిన అవసరం లేదు అని మంత్రి చెప్పారు. జగన్ తన కేసులను విచారించాలని పిటీషన్ పెట్టుకున్న దమ్మున్న నాయకుడు జగన్. పురందేశ్వరికి ఒక నియోజకవర్గం లేదు. ఆమెను చూసి ఓటు వేసే వాళ్ళు ఎవరు అంటూ మంత్రి రోజా సెటైర్ వేసింది.ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఒకరోజు అయినా అన్నం పెట్టి, నీళ్లు ఇచ్చావా పురందేశ్వరి అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. పురందేశ్వరి ఒక జగత్ కిలాడీ.. బావ కళ్లలో ఆనందం కోసం లేఖలు రాస్తోంది. పురందేశ్వరి లాంటి నీతిమాలినా, జగత్ కిలాడీ లాంటి కూతురు ఎవరికీ పుట్టకూడదని కోరుకుంటున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version