జనసేనతో పొత్తు గురించి పురంధేశ్వరీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

-

టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్టానానిదేనని ఆమె మీడియాతో అన్నారు. మూడు పార్టీలు పోటీ చేయడంపై పవన్ తన అభిప్రాయం చెప్పారని.. తమ పార్టీ నిర్ణయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుపై తాను బీజేపీ అగ్ర నాయకత్వానికి వివరిస్తానని.. తమ పార్టీ నిర్ణయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుపై తాను బీజేపీ అగ్ర నాయకత్వానికి వివరిస్తానని.. తమ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను పురంధేశ్వరి గుర్తు చేశారు.

తాము కూడా తమ పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతామని ఆమె చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం ఉందనడం అవాస్తవం అని పురంధేశ్వరి వెల్లడించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని చంద్రబాబుతో భేటీ అయిన తరువాత చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news