ఏపీ కేబినేట్ సమావేశం ప్రారంభం అయింది. 14 అంశాల అజెండా తో ఏపీ కేబినెట్ సమావేశం అయింది. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అంశాలే ప్రధాన ఏజెండాగా ఏపీ క్యాబినెట్ సమావేశం ఉంటుంది. అమరావతిలో 2700 కోట్ల రూపాయలు విలువ కల రెండు ఇంజరీనింగ్ పనులకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్… తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రి ని 50 పడకల నుంచి 100 పడకలకు అప్ గ్రేడ్ చేసే ప్రతిపాదనకు క్యాబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఏపి ఎం ఆర్ యూ డి ఏ చట్టం 2016లో భవనాల లే అవుట్ ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
పిఠాపురం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీ లో 19 నూతన పోస్టుల కు అనుమతి మంజూరు చేస్తూ మంత్రి మండలి లో ఆమోదించే అవకాశం ఉంది. గుంటూరుజిల్లా, పత్తిపాడు మండలం, నదింపాలెం గ్రామంలో ఆరున్నర ఎకరాలు స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్ఐసి ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న క్యాబినెట్…వీటితోపాటు ఎజెండా పూర్తయ్యాక సీఎం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టు బనకచర్ల ఇంట్రాకనెక్ట్ ఆఫ్ రివర్స్ పైన క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గడిచిన ఆరు నెలల పాలన రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు…ఇప్పటికే మంత్రులందరి నుంచి పర్ఫామెన్స్ రిపోర్టులను తీసుకున్నారను.