కోడి పందాల బరుల వద్ద ఓడిన పుంజల కోసం క్యూ..!

-

గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందాలు. పందాల్లో గెలిచినా.. ఓడిన కోడిపుంజుకు ఉన్న డిమాండ్ వేరు. ఓడిపోయిన కోడి కొస మాంసం తినడానికి ఎవరైనా లొట్టలు వేయాల్సిందే. డ్రై ప్రూట్స్ మేతగా వేసి కోడిపుంజులను పెంచుతారు. కాబట్టి వీటి మాంసం టేస్టే వేరుంటుంది. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే బంధువులకు, కొత్త అల్లుళ్లకు కోస టేస్ట్ కు లొట్టలేస్తారు. ఏనుగు చచ్చిన బతికిన వేయ అన్నట్టుగా పందెం పుంజు పరిస్థితి తయారైంది.

సంక్రాంతి సంబురాల్లో భాగంగా జరిగే కోడిపందాల బరిలో గెలిచిన పుంజు పందెం రాయుళ్లను సంతోష పెడుతుంటే.. ఓడిన పుంజు భోజన ప్రియుల మనస్సు గెలుచుకుంటుంది. ఏడాదంతా.. పందెం కోసం బలమైన ఆహారం పెట్టి మరీ పెంచిన పుంజు కావడంతో రుచిలో అమోఘంగా ఉంటుంది. అందుకే ఓడిన పుంజును కొని అతిథులకు విందుగా ఇచ్చేందుకు జిల్లా వాసులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కోస ధర కొండెక్కి కూర్చుంది. కోడి పందాలు చూసేందుకు వేల సంఖ్యలో తరలి వచ్చే అతిథులంతా పందెం బరుల వద్ద దొరికే చికెన్ పకోడీల కోసం క్యూ కడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news