టీడీపీ – జనసేన కూటమి విజయంలో నారా లోకేష్ దే కీలక పాత్ర – రఘురామ

-

రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కీలక పాత్ర పోషించనున్నారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. తనకు తగిలిన ఎదురు దెబ్బలను పునాది రాళ్లుగా మార్చుకుంటూ నాయకుడిగా నారా లోకేష్ గారు ఎదిగారని, విదేశాల్లో విద్యాభ్యాసం చేసిన నారా లోకేష్ గారి తెలుగు భాషను, తమ తెలుగు భాష ఏదో గొప్పగా ఉన్నట్లు కొంత మంది అపహాస్యం చేశారని అన్నారు.

raghurama comments on nara lokesh

పాదయాత్ర ద్వారా పరిణితి చెందిన నాయకుడిగా నారా లోకేష్ గారు అందరి మన్నలను పొందారని, రాబోయే ఎన్నికల్లో కూటమి విజయములో కీలక పాత్ర పోషించనున్న నారా లోకేష్ గారు అందులో అత్యద్భుత విజయాన్ని సాధించాలని, ఆయనకు తనలాగే ఎందరో అండగా ఉండనున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడైన స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version