వ్యూహం సినిమా హౌజ్ ఫుల్ అయితే మీసాలు తీస్తా – రఘురామ

-

వ్యూహం సినిమా విడుదలైన తరువాత రెండవ షో కాదు, రెండవ రోజు కూడా థియేటర్ ఫుల్ అయితే మీసాలు తీస్తానని చెప్పానని రఘురామకృష్ణ రాజు వెల్లడించారు. అయితే రాయలసీమలో ఎక్కడా వ్యూహం సినిమా ఒక్క థియేటర్ లో కూడా ఫుల్ అయిన దాఖలాలు లేవని, ఎంతో ప్రెస్టేజ్ కు పోయినా సినిమా డొల్ల అయిపోయిందని, ఈ సినిమా కలెక్షన్లను పరిశీలించిన తర్వాత ఇటీవల విడుదలై డిజాస్టర్ గా నిలిచిన యాత్ర 2 సినిమా కలెక్షన్లే బెటర్ అనిపిస్తుందని అన్నారు.

raghurama-krishnam-raju- on vyugam movie

వ్యూహం సినిమాను చాలా రిచ్ గా తీశారని, అయినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని, వ్యూహం తర్వాత శపథం సినిమా ఉందట దాన్ని ప్రీ పోన్ చేసుకొని, సోమవారమే విడుదల చేస్తే మంచిదని అన్నారు. ఎందుకంటే వచ్చే శుక్రవారం ఇంకొక సినిమాను విడుదల చేయవచ్చు అని అన్నారు. సినిమా డిజాస్టర్ గా మిగిలినా వచ్చిన నష్టమేమీ లేదని, ఎందుకంటే పాపిష్టి సొమ్ము వారి వద్ద చాలా ఉందని అన్నారు.

వ్యూహం సినిమా ఆంధ్ర ప్రాంత కలెక్షన్లను రేపు రచ్చబండ కార్యక్రమంలో వివరిస్తానని తెలిపారు. కలెక్షన్ల వివరాలను కట్టడి చేయాలని చూసినా, వాటంతాటవే వచ్చేస్తాయమ్మ మదన్ మోహన అంటూ రఘురామకృష్ణ రాజు గారు సెటైర్ వేశారు. సెన్సార్ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో వ్యూహం సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర పేరు మదన్ మోహన్ రెడ్డిగా నామకరణం చేశారని, వ్యూహం సినిమా కలెక్షన్లను చూస్తే జగన్ మోహన్ రెడ్డి గారిని చూడడానికి ప్రజలు ఇష్టపడడం లేదని తెలిసిపోతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version