అరువు విమానంలో హస్తినకు… ఆర్.ఆర్.ఆర్. వెటకారం అలా ఉంది!!

-

ప్రతిపక్షాలు సైతం తనను చూసి నేర్చుకునే స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు రఘురామకృష్ణంరాజు! వైఎస్సార్సీపీలో స్వపక్షంలో విపక్షంలో మారిన ఆర్.ఆర్.అర్. తాజాగా మరింత డోస్ పెంచారు. తనకు పార్టీ అంటే చాలా గౌరవం.. జగన్ అంటే ప్రాణం.. వైఎస్సార్ అంటే దేవుడు అని చెప్పే ఆర్.ఆర్.ఆర్… ఆయనకు గౌరవం ఉన్న పార్టీకి సంబందించిన ఎంపీలపై వెటకారాస్త్రాలు సంధించారు.

తాజాగా మైకులముందుకు వచ్చిన రఘురామకృష్ణంరాజు.. “కరోనా విషయంలో సహజీవనం చేయండి అన్న మాటలు మాని.. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పండి.. ముందు మీరు మాస్క్ వేసుకోండి.. మిమ్మల్ని చూసి ప్రజలు కూడా నేర్చుకుంటారు..” అంటూ జగన్ కు సూచనలూ సలహాలు ఇచ్చారు! “ఏం చేసినా ఫర్వాలేదు అనుకుంటే… న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదు.. ఆర్టికల్ 356 ఎంతో దూరంలో లేదన్న సంగతి గుర్తించుకోవాలి” అని ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఆ సలహాలు, సూచనలు, వార్నింగుల అనంతరం వెటాకారానికి దిగిన ఆర్.ఆర్.ఆర్… తనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైకాపా ఎంపీలు అరువు విమానం వేసుకుని హస్తినకు వచ్చి వెళ్లారని అన్నారు. ఆర్.ఆర్.ఆర్. కి సొంత విమానం ఉంటే ఉండి ఉండోచ్చు కానీ.. అందరికీ ఆ స్థాయి ఉండదన్న విషయంలో వెటకారమాడారు ఆర్.ఆర్.ఆర్.! సొంత పార్టీ నేతలతో ఫిర్యాదులు చేయించుకునే పరిస్థితికి రావడం దౌర్భాగ్యకరం అని వినిపిస్తున్న మాటల స్థానే.. తాను దీన్ని హీరో ఇజంగా భావించారో ఏమో కానీ… ఇలా వెటకారానికి దిగారు! ప్రస్తుతం ఈ స్టేజ్ కి చేరిందన్నమాట అర్.ఆర్.ఆర్. వ్యవహారం అంటూ హస్తిన టు భీమవరం కామెంట్లు పడుతున్నాయి!!

Read more RELATED
Recommended to you

Exit mobile version