పేకాట, మద్యం ,మట్కా పై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కడప కలెక్టర్, ఎస్పీలకు లేఖ రాసారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు. జమ్మలమడుగు లో జరుగుతున్న పేకాట, అసాంఘిక కార్యక్రమాలపై చర్యలు తీసుకోండి. జమ్మలమడుగు- ముద్దనూరు రోడ్డులోని జమ్మలమడుగు క్లబ్బులో దేవగుడి నాగేశ్వర్ రెడ్డి పేకాట శిబిరం నిర్వహిస్తున్నారంటూ ఆరోపణ… ఉదయం 10 నుండి రాత్రి 11 గంటల వరకు పేకాట నిర్వహిస్తున్నట్లు లేఖ లో పేర్కొన్న ఎంపీ.. మహిళలను ఇబ్బందులకు గురి చేసే అసాంఘిక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదు.
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న పేకాట, మట్కా, మద్యం దంధాలను కచ్చితంగా నియంత్రించాల్సిందే. కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను ఉపేక్షించదు. కడప జిల్లా కలెక్టర్ ఎస్పీ తక్షణమే స్పందించాలి. జమ్మలమడుగు జిల్లా సరిహద్దు గ్రామాలలో జరుగుతున్న పేకాట మక్కా కల్తీ లిక్కర్ దందాలను నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలి. అసాంఘిక కార్యక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఎస్పీలకు రాసిన లేఖలో డిమాండ్ చేసారు ఎంపీ సీఎం రమేష్.