ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటలను విశ్వసించడానికి ప్రజల సిద్ధంగా లేరని రఘురామకృష్ణ రాజు అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 99% హామీలను పూర్తి చేసి మీ బిడ్డ ఓట్లు అడగడానికి వస్తున్నాడని చెబుతున్న జగన్ మోహన్ రెడ్డి గారు, మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు పడితేనే ఓట్లు వేయమని మహిళలను కోరడం విచిత్రంగా ఉందని అన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన నారా చంద్రబాబు నాయుడు గారు, వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అత్యంత పారదర్శకంగా ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ రియంబర్స్మెంట్ ను కాలేజీ యాజమాన్యాలకు చెల్లించేవారని తెలిపారు.
ఫీజు, హాస్టల్ రియంబర్స్మెంట్ చెల్లింపులో ఆరు నెలల పాటు ఆలస్యం అయినప్పటికీ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధించేవి కావని, విద్యార్థులకు సకాలంలో సర్టిఫికెట్లను అందజేసేవని రఘురామకృష్ణ రాజు గారు గుర్తు చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు మీ అకౌంట్లలో డబ్బులు పడ్డాయో లేదో చూసుకోమని ఓట్లు వేయాలని చెత్త, సొల్లు వాగుడు వాగుతున్నారని అన్నారు. విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి నాలుగు విడతలుగా డబ్బులు వేస్తే వారి కాలేజీ యాజమాన్యానికి ఫీజులు చెల్లించాలట.. తల్లుల ఖాతాలలో డబ్బులు పడగానే, ఆ డబ్బుల కోసం భర్తలు భార్యలను హింసించిన సంఘటనలే అధికమని మహిళలు అంటున్నారని తెలిపారు.