చంద్రబాబు అనారోగ్యంతో ఏపీ శాంతి భద్రతలకు విఘాతం !

-

చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రాన్ని కుదిపేసే సమస్య అవుతుంది… శాంతి భద్రతలకు కూడా విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు.  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందులకు గురి చేయడమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యమని, చంద్రబాబు నాయుడు గారు జైలులో తీవ్ర డిహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించారు.

Chandrababu Health Bulletin released

ఆయన్ని తక్షణమే మెరుగైన చికిత్స కోసం రాజమండ్రిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు కోరారు. చంద్రబాబు నాయుడు గారు డిహైడ్రేషన్ తో బాధపడుతున్నట్టుగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా ధ్రువీకరించారని, డిహైడ్రేషన్ వల్ల సాధారణ వ్యక్తులకే చర్మ సమస్యలు తలెత్తి అవకాశం ఉండగా, చర్మ సమస్యలతో ఇబ్బంది పడే వారు ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉందని, డీహైడ్రేషన్ వల్ల చర్మ సమస్యలు తీవ్ర జటిలమై ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version