జగన్ రెడ్డి కాదు అర్జున్ రెడ్డి అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్జున్ రెడ్డి సినిమాలోని హీరో పాత్రధారి అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ ఉంటారని, ఆ పాత్రకు ప్రభావితమైన జగన్ మోహన్ రెడ్డి గారు తరచూ నేను అర్జునుడినని అంటున్నారేమోనని రఘురామకృష్ణ రాజు అపహాస్యం చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కృష్ణుడు అని చెప్పలేక, ప్రజలకు కృష్ణుడి పాత్రను పంచేసి ఈయనేమో అర్జున్ రెడ్డి గా మిగిలిపోయారని అన్నారు. నేను అభిమన్యుడిని కాదు… అర్జునుడినని పేర్కొనే జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పే డైలాగులు వింటూ ప్రజలు నవ్వుకుంటున్నారని, గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు తనని తాను సింహంతో పోల్చుకునేవారని, ప్రజలేమో గ్రామ సింహం అని అంటుండేవారని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు బైబిల్ చదవడం మానేసి పురాణాలను చదవడం మొదలుపెట్టినట్టు ఉన్నారన్నారు రఘురామకృష్ణ రాజు.