ఏపీలో వైసీపీ 15 సీట్లు కూడా గెలిచే ఛాన్స్ లేదు – వైసీపీ ఎంపీ

-

శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఏడు నుంచి 8 స్థానాలు వైసీపీ పార్టీకి వస్తే గొప్పే… ఎలా లెక్కపెట్టినా రాష్ట్రవ్యాప్తంగా 15 స్థానాలకు మించి గెలిచే ఛాన్స్ లేదంటూ విమర్శలు చేశారు రఘురామకృష్ణ రాజు. టీడీపీ, జనసేన మైత్రిని చెడగొట్టాలని కొంత మంది కొవర్టులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ చేయని ప్రయత్నం అంటూ లేదని, కానీ ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదని అన్నారు.

ఆదివారం నుంచి పున ప్రారంభం అయిన వారాహి యాత్రలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పిలుపునివ్వగా, టీడీపీ నాయకత్వాన్ని సోషల్ మీడియాలో ఎవరైనా నిందిస్తే కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

రెండు పార్టీలకు చెందిన నాయకులు సుహృద్భావ వాతావరణంలో ముందుకు వెళ్తుండడంతో తమ పార్టీ నాయకత్వానికి గుండెల్లో వణుకు ప్రారంభమైనట్లు కనిపిస్తోందని, గాలి వాన ఏకమై వస్తే వంద గొడ్లు తిన్న రాబంధు, అతని బంధువులతో సహా కొట్టుకుపోవడం ఖాయమని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు పరిశీలిస్తే తమ పార్టీకి ఏడు నుంచి 8 స్థానాలు వస్తే అదే చాలా గొప్ప అనిపిస్తోందని, నెల్లూరు జిల్లాలో ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదని, ఒంగోలులో గతంలోనే తెలుగుదేశం పార్టీకి నాలుగు స్థానాలు వచ్చాయని, ఈసారి క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version