వైసిపి పార్టీని ఎక్కడికి తీసుకుపోతారోననే భయం వేస్తోంది – RRR

-

ఎన్ఐఏ, సీబీఐలను నువ్వు నమ్మవు కానీ, సీఐడిని మాత్రం అందరూ నమ్మాలి, తనని తీసుకువెళ్లి కొట్టి చంపే ప్రయత్నం చేశారని, శ్రావణి గారిపై మరోసారి పిటి కేసు పెట్టి అరెస్టు చేశారని, మార్గదర్శిలో ఏమీ దొరకకపోయినా ఏదో దొరికించుకోవాలని జగన్ మోహన్ రెడ్డి గారు పడే తాపత్రయం చూస్తుంటే, ఈ పార్టీని ఎక్కడకు తీసుకు వెళ్తున్నారని భయం వేస్తోందని, పార్టీ సభ్యులు ఏమైపోవాలని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.

వై.యస్ ప్రతాపరెడ్డి, వై.యస్. అభిషేక్ రెడ్డి గార్లు ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయని, ఒళ్లంతా చీరేసి ఉంటే, ఇది హత్య అని లేఖ చూసి ఉంటే గుర్తుపట్టే వారమని నిందితులుగా అభియోగాలను ఎదుర్కొంటున్న వారు పేర్కొన్నట్లు సాక్షి దినపత్రికలో కథనం రాయడమే కాకుండా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి మీద, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారి మీద నిందలు వేసే మీద ప్రయత్నం చూస్తుంటే… మీకు ఏమైనా మతి దొబ్బిందా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. ప్రజలు అసహించుకుంటున్నారన్న సిగ్గయినా లేదా? అంటూ మండిపడ్డారు. ఇకనైనా ఈ హత్యా రాజకీయాలు ఆపేయండని, పులివెందులలో హత్యా రాజకీయాలు ఆగిపోవాలన్నదే సునీత గారి తాపత్రయం అని అన్నారు.

ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేయాలన్నదే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నం కాగా, జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిచోట ఒకే అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనకు మీడియా లేదని, పత్రికా లేదని, సోషల్ మీడియా కూడా లేదని, తాను మీ బిడ్డనని శ్రీకాకుళం, రాయలసీమ, కోస్తాంధ్రలో చెప్పుకుంటూ వెళ్తున్నారని, ప్రజలందరికీ మీరే బిడ్డ అంటే జనం నమ్మేస్తారా?, సాక్షి దినపత్రిక ఎవరిది?. సాక్షి దినపత్రిక, ఛానల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో వందలాది మందిని నియమించుకొని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అవినాష్, సునీత, రాజశేఖర్ రెడ్డి, ముస్లిం యువతీ ఫోటోలు పెట్టి నాన యాగి చేస్తున్నది ఎవరని ప్రశ్నించారు. సాక్షి పేపర్ మీది అయినప్పటికీ మీదేనని మీరు చెప్పుకోలేరని, ప్రజలందరికీ బిడ్డనని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి గారు వారి తల్లి గారి పుట్టిన రోజు మాత్రం ఆమెను కలిసేందుకు వెళ్లరని, చెల్లితో మాట్లాడరని, మరొక చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి, తల్లిని చూస్తే బాధ అనిపిస్తుందని, ఇంకా ఈ పార్టీ సభ్యుడైన తాను ఈ పార్టీ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నానని అన్నారు. పార్టీ పుత్రికైన సాక్షి దినపత్రిక రాస్తున్నదేమిటి, సాక్షి రాతలు చూస్తుంటే, హత్య కుట్రలో ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పటికీ, జగన్ మోహన్ రెడ్డి, భారతీ గార్ల ఇన్వాల్వ్మెంట్ ఉందేమోననే అనుమానం ప్రజలకు కలుగుతోందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారికి తన సోదరుడిపై ప్రేమ ఉండవచ్చునని, దానికి పార్టీ బలై పోవాలా?, పార్టీ మీది కాదు… మనందరి ఆస్తి అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version