సీబీఐ తీరు చూసి..ప్రజలు నవ్వుకుంటున్నారు – RRR

-

సీబీఐ తీరు చూసి..ప్రజలు నవ్వుకుంటున్నారని చురలకు అంటించారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారి పట్ల సీబీఐ అనుసరిస్తున్న తీరు విస్మయాన్ని కలిగిస్తుందని, 72 ఏళ్ల వృద్ధుడైన అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారిని ఇంటి వద్దకు వెళ్లి అరెస్టు చేసిన సీబీఐ అధికారులు, విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా హాజరుకాని అవినాష్ రెడ్డి గారిని అరెస్టు చేయకుండా పదేపదే నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు.

కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న, స్థానిక క్లార్కు హోటల్లో బస చేస్తున్న ఆయన్ని అరెస్టు చేయడానికి ఉన్న అడ్డంకులు ఏమిటో అర్థం కావడం లేదని, అవినాష్ రెడ్డి గారి తల్లికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని, తక్షణమే ఆమెను మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాదుకు తరలించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అవసరమైతే ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి అవినాష్ రెడ్డి గారి తల్లిని హైదరాబాదుకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని, అవినాష్ రెడ్డి గారి తల్లి ఆరోగ్యంగానే ఉందని ప్రజలందరూ భావిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఆమె అనారోగ్యంతో ఉన్నట్లుగా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులదేనని అన్నారు. కర్నూలులోని వారి బంధువుల ఆసుపత్రిలో చికిత్స పొందితే, వారికి కావలసినట్టుగా వైద్య నివేదికలను ఇస్తారని, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లినా గుంటూరు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రభావతి వంటి వారు ఇక్కడ ఉంటే తప్పుడు నివేదికలను ఇచ్చి కాపాడే ప్రయత్నాన్ని చేస్తారని, అందుకే హైదరాబాదుకు తరలించి ఆమె ఆరోగ్య పరిస్థితిపై నిజానిజాలను వెల్లడించేందుకు సీబీఐ చర్యలు తీసుకోవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version