రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం – కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు

-

కర్నాటక కాంగ్రెస్ నేతలు సమిష్టిగా పనిచేసి ఈ విజయం సాధించారని అన్నారు కేంద్ర మాజీ మంత్రి, ఏపీ సీనియర్ నాయకుడు పల్లం రాజు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఇకపై కాంగ్రెస్ పార్టీ విజయం తధ్యమనే భావనలు మొదలయ్యాయన్నారు.

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని.. ఏపి లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందన్నారు. విభజన అంశం ఇప్పుడిప్పుడే పాతపడిపోతోందని.. ఏపిలో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు పూర్తిగా అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి బదిలీ అయిందన్నారు. అయితే అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ప్రస్తుతం తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.

ఏపిలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకుంటే, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు బాగుంటుందన్నారు. అందుకోసం కష్టపడుతున్నామని తెలిపారు పల్లంరాజు. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రజల్లో మంచి మనసున్న నాయకుడు అనే అభిప్రాయం బలపడిందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version