గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ముంచేస్తుంది. మంగళగిరి, తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాలలో పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. పేదపరిమి వద్ద కొటేళ్ల వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో పేద పరిమి – తుళ్లూరు రూట్, లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగడంతో గుంటూరు – తాటికొండ రూట్, సత్రం వాగు, పీలేరు వాగు ఉప్పొంగడంతో గుంటూరు – మాచర్ల రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దీంతో రోడ్లమీద వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు ఏపీ తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని చెబుతున్నారు. వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాలలో స్కూల్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.