రామగుండం ఎరువుల కర్మాగారం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఒక ముఖ్యమైన పారిశ్రామిక యూనిట్. ఇది గతంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గా పనిచేసింది. నష్టాల కారణంగా 1999లో ఈ కర్మాగారం మూతపడింది దేశంలోనే యూరియా ఉత్పత్తిని పెంచి దిగుమతులను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దించడానికి అనేక చర్యలు చేపట్టింది. మరి కేంద్రం తీసుకున్న చర్యలను తెలుసుకుందాం..
నూతన ఎరువుల విధానం : కేంద్ర ప్రభుత్వం 2012 నూతన ఎరువుల విధానం ప్రకటించింది ఈ విధానం యూరియా రంగంలో కొత్త పెట్టుబడుదల ప్రోత్సహించింది. మరియు దేశాన్ని యూరియా ఉత్పత్తిలో స్వలంబనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం కింద రామగుండం సహా 5 మూతపడిన ఎరువుల కర్మాగారాలు పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందించబడ్డాయి.
రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కోసం 2017 ఫిబ్రవరి 15న రామగుండం ఫెర్టిలైజేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మరియు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ 26% వాటా ను, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 11% వాటా ను, తెలంగాణ ప్రభుత్వం 11% వాటా, జిఏఐఎల్ ఇండియా లిమిటెడ్ కు 14.3% వాటా HTAS 11.7% వాటా భాగస్వాములుగా ఉన్నారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా గ్యాస్ అదారిత అమ్మోనియా, యూరియా యూనిట్ తయారు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇది సంవత్సరానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తుంది.
రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కర్మాగారం మూతపడిన తర్వాత,దానిని తెరిపించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రత్యేకంగా రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం రూ.6,120 కోట్ల పెట్టుబడులని పెట్టింది. ఈ నిధులు కర్మాగారం నిర్మాణం, ఆధునిక, సాంకేతికతను అమలు చేయడం సమర్థవంతమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, ఉపయోగించారు.ఈ పునరుద్ధరణతో RFCL ప్రస్తుతం యూరియా,అమోనియా వంటి ఎరువులను ఉత్పత్తి చేస్తుంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది.