చంద్రబాబుతో రజనీకాంత్ ములాఖత్ ముచ్చట ఉత్తదేనట. నిన్నటి నుంచి చంద్రబాబుతో రజనీకాంత్ ములాఖత్ అవుతున్నారని టీడీపీ సోషల్ మీడియా, టీడీపీ అనుకూల మీడియా తెగ ప్రచారం చేశాయి. శనివారం రోజున రాత్రి చంద్ర బాబుతో రజనీకాంత్ ములాఖత్ అవుతున్నారని పేర్కొన్నాయి.
అయితే.. చంద్రబాబుతో రజనీకాంత్ ములాఖత్ పై క్లారిటీ వచ్చేసింది. చంద్రబాబుతో రజనీకాంత్ ములాఖత్ పై వచ్చిన వార్తలను ఖండించాయి రజినీకాంత్ కార్యాలయ వర్గాలు. రజనీకాంత్ ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నారని… రాజమండ్రి వచ్చే షెడ్యూల్ ఏదీ లేదని స్పష్టం చేసింది వ్యక్తిగత సిబ్బంది. దీంతో చంద్రబాబుతో రజనీకాంత్ ములాఖత్ ముచ్చట ఉత్తదేనని అందరూ అంటున్నారు.
కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో.. వారానికి మూడుసార్లు ములాఖత్‍కు అవకాశం ఉన్నా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు నారా భువనేశ్వరి.