ఆ విషయం మీద ఇక ట్వీట్స్ చేయను : రామ్

-

విజయవాడ రమేశ్ ఆసుపత్రికి చెందిన ప్రైవేటు కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం విషయంలో నిన్న హీరో రామ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అసలు ఎప్పుడూ ఎలాంటి రాజకీయ అంశాల జోలికీ వెళ్ళకుండా సైలెంట్ గా తన సినిమాలు, తను అన్నట్టు ఉండే ఆయన ఏపీ సీఎం ను ట్యాగ్ చేసి మరీ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ప్రమాదం విషయంలో తమ దర్యప్తుకి ఆటంకం కలిగిస్తే హీరో రామ్ కు కూడా నోటీసులు పంపుతామని విజయవాడ ఏసీపీ ప్రకటన చేశారు.

ఈ క్రమంలో హీరో రామ్ ఆయన ప్రకటన గురించి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. ఈ వ్యవహారంలో ఇకపై తాను ఎలాంటి ట్వీట్లు చేయబోనని తెలిపారు. తనకు న్యాయం మీద నమ్మకం ఉందన్న ఆయన నిజమైన దోషులు ఎవరైనా, ఎవరికి చెందినవారైనా తప్పకుండా శిక్షించబడతారని నమ్ముతున్నానని అన్నారు . ఇక ఈ వ్యవహారంలో ఇక ట్వీట్లు చేయాలనుకోవడం లేదన్న ఆయన ఈ వ్యవహారంలో చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పేశానని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version