మత సామరస్యానికి ప్రతీక రంజాన్ : మంత్రి రాం ప్రసాద్ రెడ్డి

-

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి  శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని, రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1వ తేదీ శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్వ మతాల సారాంశం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన ప్రార్ధనలు, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.

మైనార్టీ సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజులుగా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి మూడు పూటలా నమాజ్ చేసుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పవిత్రతను గుర్తించి అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు. రాబోయే రోజుల్లో హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవించి అన్నమయ్య జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేందుకు కృషి చేయాలన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news