ఏపీఎల్ చాంపియన్ రాయలసీమ కింగ్స్ గా నిలిచింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేతగా రాయలసీమ కింగ్స్ అవతరించింది. ఆదివారం నాటి ఫైనల్ లో కోస్టల్ రైడర్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తోలుత బౌలింగ్ ఎంచుకున్న రాయలసీమ కింగ్స్ కోస్టల్ రైడర్స్ ను 155 పరుగులకు కట్టడి చేసింది.
రైడర్స్ బ్యాటర్లలో ఓపెనర్ ధరణి కుమార్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్య చేదనకు దిగిన రాయలసీమ కింగ్స్ కు ఓపెనర్ తోట శ్రావణ్ 24 పరుగులతో శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ కోగటం హనీష్ రెడ్డి డక్ అవుట్ కాగా, వన్ డౌన్ బ్యాటర్ తన్నీరు వంశీకృష్ణ మూడు పరుగులకే నిష్క్రమించాడు. 16.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసిన రాయలసీమ కింగ్స్ ఛాంపియన్ గా అవతరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోస్టల్ రైడర్స్ ను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది.