లెజెండరీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు చిత్రంతో రూపొందిన రూ.100 నాణేన్ని ఇవాళ రాష్ట్రపతి ముర్ము విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని ఆయన గౌరవార్థం రూ. 100 నాణెం ముద్రించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.అయితే, తాను ఎన్టీఆర్ భార్యనని, ఆయన చిత్రంతో ముద్రించిన నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే హక్కు తనకుందని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అంటున్నారు. ఈ మేరకు తనకు కూడా ఆహ్వానం పంపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లక్ష్మీపార్వతి లేఖ రాశారు.