శ్రీవారి భక్తులకు శుభవార్త….ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పున:రుద్దరణ

-

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ్టి నుంచి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పున : ప్రారంభం కానున్నాయి. నిన్నటి వరకు తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. అయితే.. తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు నిన్నటి తో ముగిసాయి.

దీంతో ఇవాళ్టి నుంచి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పున : ప్రారంభం కానున్నాయి. ఇక ఇవాళ్టి నుంచి.. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు చేసుకోవచ్చని టీటీడీ ప్రకటన చేసింది. ఇది ఇలా ఉండగా, తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక 55, 747 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 21774 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా.. తిరుమలలో నిన్న ఒక్క రోజు తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 4.11 కోట్లు గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news