ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో 2,526 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రభుత్వం మరింత విస్తరించింది. తొలి దశలో 51, రెండవ దశలో 1,500 గ్రామాల్లో సేవలు అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా 2,526 సచివాలయాలకు అనుమతులు మంజూరు చేసింది.
అక్కడ పనిచేసే కార్యదర్శులకే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించింది. భూముల రీసర్వే పూర్తయి, LPM(ల్యాండ్ పార్సిల్ నంబర్) వచ్చిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. కాగా, ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందించింది జగన్ సర్కార్. జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఇవాళ సీఎం వైఎస్ జగన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి..ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.