టికెట్‌ రాకపోయినా పోటీ చేస్తా.. నర్సాపూర్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ 115 మందితో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో దాదాపుగా సిట్టింగులకే స్థానాలు ఖరారు చేయగా.. కొన్ని స్థానాల్లో మాత్రం సిట్టింగులను మార్చేసింది. ఈ క్రమంలోనే మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ నుంచి టికెట్‌ ఆశించి ఎమ్మెల్యే మదన్ రెడ్డి భంగపడ్డారు. ఆయన స్థానంలో టికెట్​ను సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వనున్నట్లు సమాచారం.

అయితే ఈ వ్యవహారంపై మదన్ రెడ్డి స్పందించారు. తనకు బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినా.. రాకపోయినా పోటీలో ఉండేందుకే ఆసక్తి చూపుతునట్లు మదన్‌రెడ్డి తెలిపారు. ఈ దఫా పోటీ విషయంలో తన సన్నిహితులు, కార్యకర్తలు ఒత్తిడి తెస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి నర్సాపూర్​లో మదన్‌రెడ్డి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో మూడోసారి పోటీచేసి హ్యాట్రిక్‌ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. కానీ అధిష్ఠానం ఆలోచన మాత్రం వేరేలా ఉంది. ఈ నియోజకవర్గం టికెట్ సునీతారెడ్డికి టికెట్‌ కేటాయిస్తుందన్న సమాచారంతో ఆయన అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version