జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల

-

జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్‌.. జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… జగనన్న విద్యా దీవెన క్రింద నేడు అందిస్తున్న రూ.583 కోట్లతో కలిపి ఇప్పటి వరకు విద్యా దీవెన, వసతి దీవెనల క్రింద మన ప్రభుత్వం చేసిన, చేస్తున్న వ్యయం మొత్తంగా . 18,576 కోట్లు అన్నారు.

CM Jagan’s visit to Tirupati district today

ఇది గత ప్రభుత్వం చేసిన వ్యయం కంటే 6,435 కోట్లు అధికమన్నారు సీఎం జగన్. జగన్నన్న విద్యాదీవెన కింద 27లక్షల 16వేల మంది పిల్లలకు స్కూల్ ఫీజులు అందించామని వివరించారు. ఈ ఒక్క పథకం ద్వారా రూ.11,900 కోట్లు అందించాం.. వసతి దీవెన కింద మరో రూ.4,275 కోట్లు ఖర్చు చేశామన్నారు.శ్రీమంతులకే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్‌ను ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు అందించాం.. ఆరో తరగతి పైన అన్ని క్లాసులను డిజిటలైజ్ చేశామని వివరించారు సీఎం వైఎస్ జగన్.

Read more RELATED
Recommended to you

Latest news