హైకోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డిలకు ఊరట లభించింది. పోసాని కృష్ణమురళి వాంగ్మూలం ఆధారంగా తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, ఈ మేరకు తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసారూ సజ్జల, భార్గవ్ రెడ్డి. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి ఇరువురికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.

ఇక అటు వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినికి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆమెతో పాటు తన మరిది గోపిపై పల్నాడు జిల్లా ఎస్పీకి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గతంలో రజిని అక్రమాలను ప్రశ్నించినందుకు వంద మందితో వచ్చి సదరు వ్యక్తిపై దాడి చేసినట్లు తెలిపారు.