వెస్ట్ బెంగాల్‌లోని మాల్దాలో రంజాన్ పండుగకు ముందు మత హింస చెలరేగింది. జిల్లాలో జరిగిన మత హింసకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఒక గుంపు రోడ్లపైకి వచ్చి ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
మాల్డా జిల్లాలోని మోతబరిలో ఒక ముస్లిం గుంపు హిందువుల వ్యాపార వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని వారి షాపులను ధ్వంసం చేసినట్లు సమాచారం.అంతేకాకుండా వ్యాపార సముదాయాలకు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. రోడ్ల మీద ఆటోలు, వాహనదారుల మీద కర్రలతో దాడులు చేస్తున్న దృశ్యాలు నెట్టింట భయాందోళనకు గురిచేస్తున్నాయి.