ఏపీ ప్రజలకు షాక్. నిషిద్ధ జాబితా నుంచి 2 లక్షల ఎకరాల భూములు తొలగింపు జరిగినట్లు సమాచారం. చుక్కల భూములను నిషిద్ధ భూముల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది.
ఇప్పటికే నెల్లూరు జిల్లాలో 43 వేల ఎకరాల చుక్కల భూములను, బాపట్ల జిల్లాలో 7,917 ఎకరాల చుక్కల భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు. వివాదాస్పద వాన్ పిక్, ఇతర భూములను మాత్రం నిషిద్ధ జాబితాలోని కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు.
ఇది ఇలా ఉండగా.. వాలంటీర్లకు వందనం పేరుతో గ్రామ, వార్డు వాలంటీర్లను ఈ నెలలో సన్మానించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం జగన్ ఈనెల 14న కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నియోజకవర్గంలో ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులు ప్రధానం చేసి రూ.30000, మండల మున్సిపాలిటీలో మరో ఐదుగురికి సేవరత్న అవార్డుతో పాటు రూ. 20,000, మిగతా 2.28 లక్షల వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డు, రూ.10 వేలు చొప్పున అందిస్తారు.