తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లే వారికి బిగ్ అలర్ట్. సంక్రాంతి పండుగ త్వరలోనే రానుంది. ఈ తరుణంలోనే… తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు హైదరాబాద్ నగరం నుంచి తరలివెళుతున్నారు జనాలు. ఈ తరుణంలోనే..నేటి నుంచి గోదావరి జిల్లాలకు వచ్చే సంక్రాంతి రైళ్ల రిజర్వేషన్ బుకింగ్స్ ప్రారంభం అయినట్లు అధికారులు ప్రకటన చేశారు.
సంక్రాంతి రద్దీ దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు అధికారులు. కాచిగూడ -కాకినాడ టౌన్, హైదరాబాద్- కాకినాడ టౌన్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో ఈ రైళ్ల రాకపోకలు ఉంటాయి. ఇక ఈ ఉదయం 8 గంటల నుంచి ఈ స్పెషల్ రైళ్లకు టికెట్ రిజర్వేషన్ల బుకింగ్ సదుపాయం ఉంటుంది. ఈ స్పెషల్ రైళ్ల ఏసీ, స్లీపర్, జనరల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.