తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఫిబ్రవరి ఆరంభంలోనే హైదరాబాద్ నగరంతో పాటు…తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎండ సెగ మొదలైంది. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం గరిష్టంగా మోండా మార్కెట్ లో 36.3° నమోదయింది. సరూర్నగర్ లోను 36.3, బాలానగర్ 35.9, బేగంపేటలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరిగాయి.
రెండు రోజుల క్రితం వరకు 16 నుంచి 17° కంటే ఇప్పుడు 21.2గా నమోదు అయింది. ఇది సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికమని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి ఎండలు ఎక్కువే ఉంటాయని సంకేతాలు ఆశాఖ నుంచి వెలువడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుదలతో పగలు రాత్రి ఇళ్లలో ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. ఏసీలు వాడటం ప్రారంభించారు. పగటిపూట 3,100 మెగావాట్ల వరకు డిమాండ్ ఉంటే రాత్రి 9 గంటలకు 2,697 మేర నమోదయింది. గత ఏడాది ఇదే సమయంలో రాత్రిపూట 2,287 మెగావాట్లే డిమాండ్ ఉంది.