జనసైనికులు జెండాలు మోసే కూలీలు అయ్యారు : మంత్రి రోజా

-

జైలులో ఉన్న ఖైదీతో ప్యాకేజీ తీసుకొని పొత్తు పెట్టుకున్న ఒకే ఒక పార్టీ జనసేన అని మంత్రి రోజా విమర్శించారు. ‘పవన్ ప్రజల కోసం పోరాటం చేయకపోయినా చంద్రబాబు కోసం చేస్తానంటున్నాడు. జన సైనికులు జెండాలు మోసే కూలీలు అయ్యారు. మేము ఎందుకు ఈ పార్టీలో ఉండాలని వాళ్లు ఏడుస్తున్నారు.

పవన్ లాగా జగన్ మాతో ఇతర పార్టీల జెండాలు మోయించట్లేదు. దమ్మున్న నాయకుడు జగన్. ఆయన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది’ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ జెండా చంద్రబాబు ప్యాకేజీ అని.. అజెండా చంద్రబాబు, లోకేష్ కు బానిసగా బతకటం అంటూ రెచ్చిపోయారు మంత్రి రోజా. భార్య ఉండగా వేరే అమ్మాయితో పిల్లలను కంటే ఎలా ఉంటుం దో ఆలోచించండి అని రేణు దేశాయ్ గతంలో జన సైనికులకు చెప్పారు…ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటనతో రేణు దేశాయ్ వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయని చురకలు అంటించారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version