బావమరిదిలా చంద్రబాబు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారా ? అంటూ ఏపీ మంత్రి రోజా ట్వీట్ చేసారు. రూ. 118 కోట్ల ముడుపుల కేసులో చంద్రబాబుకు ఐటి నోటీసులపై మంత్రి రోజా ట్విట్టర్ లో స్పందించారు. ‘ఈ కేసులో ధైర్యంగా ఆయన విచారణ ఎదుర్కొంటారా? అంటూ నిలదీశారు మంత్రి రోజా.
లేక బావమరిదిలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారా? రామోజీల మంచం ఎక్కుతారా? అచ్చన్నల రమేష్ ఆసుపత్రిలో చేరతారా? విజయ్ మల్యాల విదేశాలకు పారిపోతారా? ఇవన్నీ కాకుండా ఇప్పటిలాగే మరో స్టే తెచ్చుకుంటారా?’ అని ప్రశ్నిస్తూ సెటైర్లు వేశారు.
ముఖ్యంగా ప్రశ్నిస్తా అంటూ చెప్పే వపన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. బీజేపీ అంటే ఏపీలో బాబు జనతా పార్టీగా మారిందని.. పురంధేశ్వరి ఎందుకు మరిది గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సింగపూర్ లో దోచుకున్న మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లారన్న రోజా.. త్వరలోనే అమరావతి అవినీతి కేసులో చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళ్తారని పేర్కొన్నారు.