నాలాగే, విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు రావాలి – రఘురామకృష్ణ

-

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుతాన్ని ప్రశ్నించిన వారందరికీ నోటీసులు జారీ చేస్తూ సీఐడీ దగుల్బాజీ సంస్థగా మారిందని రఘురామకృష్ణ రాజు గారు ఫైర్ అయ్యారు. ఇటీవల న్యాయవాదులు ప్రశ్నించగా వారికి నోటీసులు జారీ చేశారని, ఇదే విషయాన్ని న్యాయవాదుల బృందం, ప్రధాన న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకువెళ్లారని, రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలన గురించి తాను లేఖ ద్వారా ప్రధాన మంత్రి గారికి నివేదించడంతో పాటు, హోంమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగిందని అన్నారు.

తమ పార్టీ శ్రేణులు జరిపిన రాళ్ల దాడిలో ఎన్ ఎస్ జి కమాండోకు తగిలిన రాయి చంద్రబాబు గారి తల కణతకు తగిలి ఉంటే ఆయన చనిపోయి ఉండేవారని, రాష్ట్రంలో కొనసాగుతున్న రావణ, నరకాసుర, హిరణ్య కష్యుడి పాలనలో జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిన ప్రధాన ప్రతిపక్ష నేత రక్షణకే దిక్కు లేకుండా పోతుందని, ఈ రాక్షస, దుర్మార్గపు పోలీస్, సీఐడీ పాలన నుంచి రాష్ట్ర ప్రజలను గవర్నర్ గారు కాపాడాలని అన్నారు.

గతంలో కసాయిలాగా వ్యవహరించే విజయ సాయి రెడ్డి గారు, సినీ హీరో నాగార్జున ప్రచారం చేస్తున్నా సంస్కారవంతమైన ట్రిపుల్ ఎక్స్ సోప్ ను ఉపయోగించినట్లుగా ఈ దరిద్రపు సంస్కృతి నుంచి బయట పడుతున్నారని, అలాగే ఈ దుష్ట సమూహము నుంచి తనలాగే బయటపడితే మంచిదని సూచించారు. దుష్టులకు ఉన్నత విద్యావంతుడైన విజయసాయిరెడ్డి గారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version