కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు…అక్రమాలకు చిరునామా అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాజకీయ ఆట నిబంధనలను మార్చిన నాయకుడు జగన్ అని.. గడప గడపకు వెళుతున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న అభిమానం వ్యక్తం అవుతోందని తెలిపారు. ప్రతిపక్షాలకు అర్హత లేదు… తోడేళ్ళ మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నాయని ఆగ్రహించారు.
రాజకీయం అంటే ఎత్తులు, పొత్తులతో కాదు… ప్రజలకు ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేయాలని తెలిపారు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు…అక్రమాలకు చిరునామా అని… ఆ అక్రమ కట్టడంలో చంద్రబాబు ఏ హోదాలో ఉంటున్నారో అర్థం కాదని ఆగ్రహించారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇంటి అలవెన్సు పొందుతున్నారు… కాని ఎక్కడా అద్దెకు తీసుకున్నట్లు ఒప్పందాలు లేవని మండిపడ్డారు. లింగమనేని రమేష్ ఆ ఇంటిని దేశభక్తితో ప్రభుత్వానికి ఇచ్చినట్లు కోర్టుకు చెప్పారు.. మరి చంద్రబాబు అధికారం పోయిన తర్వాత కూడా అదే ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నారు?? పేదల, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని నిప్పులు చెరిగారు.