అంగన్వాడీల జీతాల పెంపు సాధ్యం కాదు – సజ్జల రామకృష్ణారెడ్డి

-

అంగన్వాడీల జీతాల పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. అంగన్వాడీలతో అనేక దఫాలుగా చర్చలు జరిపామని..అయినా సమ్మె కొనసాగిస్తున్నారని తెలిపారు. అందుకే ఎస్మా పెట్టాం..కొంత మంది అంగన్వాడీ వర్కర్లు నాయకులు ఆడియో మెసేజ్ లు బయటకు వచ్చాయని పేర్కొన్నారు. వీటిలో రాజకీయ అజెండా కనిపించిందని ఆరోపణలు చేశారు.

వాళ్ళు రాజకీయం చేస్తున్నారని నేను అనటం లేదు…చేయగలిగినంతా ప్రభుత్వం చేసిందని తెలిపారు. భవిష్యత్తులో మరింత చేస్తాం అని కూడా చెప్పామని… వాళ్ళ డిమాండ్ లో నిజాయితీ ఉన్నట్లే మా హామీలోనూ నిజాయితీ ఉందని వెల్లడించారు. జీతాల పెంపు ఒక్కటే చేయలేం అని చెప్పామని..వీరి వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. జైలుకు కూడా వెళ్తాం అంటున్నారు…ఇలాంటి బెదిరింపు ధోరణి వల్ల సమస్య మరింత జటిలం అవుతుందని తెలిపారు. రాజకీయ అజెండా కు బలి కావద్దు అని కోరుతున్నానన్నారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Exit mobile version