4 గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

-

గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈ తరుణంలోనే..నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీల పై అనర్హత వేయాలని ఫిర్యాదు చేసింది వైసీపీ. అనర్హులను చేయాలని అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆఫీసుల్లో ఫిర్యాదు చేసింది వైసీపీ పార్టీ.

ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిల పై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. అటు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ, సి.రామచంద్రయ్యలపై కూడా అనర్హత వేయాలని ఫిర్యాదు చేసింది వైసీపీ. తాజాగా జనసేనలో ఎమ్మెల్సీ వంశీ కృష్ణ చేరగా, టీడీపీలో సి. రామచంద్రయ్య జాయిన్‌ అయ్యారు. గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ లైన్ దాటారు నలుగురు ఎమ్మెల్యేలు. ఇక ఈ నలుగురిని అప్పుడే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ పార్టీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version