డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో లేడు..అందుకే చర్యలు తీసుకోం – సజ్జల

-

నిన్న వైసీపీ పై డీఎల్ రవీంద్రారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై సజ్జల స్పందించారు. డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీకి చాలా కాలంగా దూరంగా ఉన్నారు..డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో ఉన్నట్లు మేము భావించడం లేదని వివరించారు. అందుకే చర్యలు తీసుకోవటం లేదన్నారు. డీఎల్ రవీంద్రారెడ్డితో ఎవరు మాట్లాడించారో ఆయన మాటలు వింటే అర్ధం అవుతుందని చెప్పారు.

ట్యాబుల పంపిణీలో అవకతవకలు అంటూ నోటికొచ్చినట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని..ట్యాబ్ ల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ చేశారని ఆగ్రహించారు. ట్యాబ్ ల కొనుగోలులో అవకతవకలకు తావు లేదని… బైజ్యూస్ కంటెంట్ కు చాలా డిమాండ్ ఉంది, అలాంటిది పిల్లలకు ఫ్రీగా ఇస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే చంద్రబాబు అప్పుడే ఎందుకు చేయలేదని.. ఈడబ్ల్యూఎస్‌లో కులాల వారీగా రిజర్వేషన్లు తీసుకోవడానికి లేదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని పేర్కొన్నారు. కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం ఎక్కడా క్లారిటీగా చెప్పలేదని.. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను అడ్డుకునేందుకు మాకేం పని అని చురకలు అంటించారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Exit mobile version